మంచేరియల్, 12 November
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ. 26 వేల వేతనం చెల్లించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్ఎంవో టి. శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ.. గత 10 నుంచి 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కార్మికులకు నాలుగేళ్లు దాటినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమని అన్నారు. కార్మికులకు చట్ట ప్రకారం పండుగ, జాతీయ, ఆర్జిత సెలవులు, వార్షిక బోనస్, రెండు జతల యూనిఫారాలు కల్పించాలని కోరారు.
ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాలను సక్రమంగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్లు కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తూ, ఈఎస్ఐ, పీఎఫ్ మొత్తాలను పూర్తిస్థాయిలో జమ చేయడం లేదని ఆరోపించారు. వెంటనే నూతన కాంట్రాక్టర్లను నియమించి, కార్మికులకు రూ.26 వేల వేతనంతో పాటు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలిందర్ అలీ ఖాన్, కార్మికులు రాయమల్లు, మధు, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.






