చేస్తామని (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 12
జిల్లాలో అర్హులైన ప్రతి పేదవారికి చేయూత పింఛన్లు మంజూరు జిల్లా కలెక్టర్ కె.
జిల్లాలో అర్హులైన ప్రతి పేదవారికి చేయూత పింఛన్లు మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేయూత పింఛన్ల కోసం 9,466 దరఖాస్తులు రాగా 8,540 మందిని అర్హులుగా గుర్తించామని, మిగిలిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని వివరించారు. సమాజంలోని అత్యంత బలహీనవర్గాలను రక్షించేందుకు ఈ పథకం ఉద్దేశించబడిందని, దీనివల్ల ప్రజావాణిలో పింఛన్ల కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెల్లడి
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ చేయూత పింఛన్ల మంజూరీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అన్నారు. దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా ఆర్థిక భద్రతతో జీవించేందుకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందని చెప్పారు. లబ్ధిదారులు పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలీబిన్ అహ్మద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, డిపిఎం రామకృష్ణ, ఎంపిడిఒ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.



