మంచిర్యాల (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 13
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిధిలో ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తూ, వరుస నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న యువకుడిపై పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీరాంపూర్‌లోని అరుణక్క నగర్‌కు చెందిన జలంపల్లి సందీప్ (20)కు నగర బహిష్కరణ నోటీసు జారీ చేసినట్లు శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల అశోక్ తెలిపారు.

2023 నుంచి 2026 వరకు పలు నేర కార్యకలాపాలకు పాల్పడుతూ, రౌడీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇప్పటికే రౌడీషీట్ ఉన్నప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పోలీసుల హెచ్చరిక
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు, డీసీపీ, ఏసీపీల సూచనల మేరకు నగర బహిష్కరణ నోటీసులు జారీ చేసినట్లు సీఐ ఆకుల అశోక్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.