సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్కూరు మండలం లో తనపై హత్యాయత్నం జరిగిందని అనుమానిస్తున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ, టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న శుక్రవారం రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనలో గాయపడిన బాధితులను ఆసుపత్రుల్లో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజీపీ కార్యాలయానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు, తన అనుమానాలకు సంబంధించిన ఆధారాలను డీజీపీకి అందజేశారు.
విచారణకు విజ్ఞప్తి
ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన బాధితులకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధరపు నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






