కౌటాల (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 12
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మండల కేంద్రంలో నకిలీ నోట్ల కలకలం రేగింది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మండల కేంద్రంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. హెచ్పీ గ్యాస్ కోసం గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ నోట్లను ఉపయోగించినట్లు గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలో గ్యాస్ అవసరాల నిమిత్తం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ నోట్లు అందజేసినట్లు స్థానికంగా గుర్తించారు.
ప్రజల్లో ఆందోళన
ఈ ఘటనతో మండల పరిధిలో నకిలీ నోట్ల చలామణి జోరుగా సాగుతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. మండలంలో దొంగ నోట్లు చలామణి అవుతున్నాయన్న వార్త వ్యాపించడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నగదు లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు.
అధికారులకు విజ్ఞప్తి
నకిలీ నోట్ల ముఠా కదలికలపై సంబంధిత అధికారులు నిఘా పెంచి, తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.






