మంచిర్యాల జిల్లా దేవాపూర్ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు రూపొందించిన కురేన్ ఘాట్ సినిమా పోస్టర్ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్ ల ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకోవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. మన ప్రాంత కళాకారులు రూపొందించిన సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వారికి తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
ఈ సినిమాకు మంచిర్యాల జిల్లా వాసి దొబ్బల శంకర్ నిర్మాతగా, దుర్గం విజయ్ దర్శకుడిగా, శ్రీమాన్ హీరోగా, తోట మహేష్ విలన్ గా వ్యవహరించారు. వేణు సంగీతం అందించగా, లక్కీ లక్ష్మణ్ కొరియోగ్రాఫర్‌గా, రమేష్ రాజా ఫైట్ మాస్టర్‌గా, కంపెల శ్రీనివాస్ మాటల రచయితగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనుదీప్, సీనియర్ డ్యాన్స్ మాస్టర్ రిథమ్ సది, నమ్రిత్, గౌరీష్, గిరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు ముడారపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






