రామగుండం, పెద్దపల్లి (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 16
ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించిన పోలీస్ కమిషనర్, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి జాప్యం, అలసత్వానికి తావులేకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి పరిపాలన కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.


