మంచిర్యాల జిల్లాకు చెందిన సివి రామన్ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాశాల బీకాం మూడో సంవత్సరం విద్యార్థి సిద్ధార్థ, సివి రామన్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థి సింహాద్రి, అవేజ్ (బీకాం ప్రథమ సంవత్సరం) కూడా ఎంపికైనట్లు సెలక్షన్ కమిటీ సభ్యులు, పీడీలు నూనె శ్రీనివాస్, ప్రశాంత్ తెలిపారు.
వచ్చే నెల 17, 18, 19, 20 తేదీల్లో తమిళనాడులోని యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీల్లో వీరు కాకతీయ యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.
విద్యార్థుల ఎంపికపై కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రెడ్డి, కరస్పాండెంట్లు శ్రీనివాస్ రాజు, శ్రీధర్ రావు, రామన్ కళాశాల డైరెక్టర్ నరసయ్య అభినందనలు తెలిపారు.
పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.






