పాటించాలని (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 12
వానాకాలం 2026-27 సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు ఆదేశించారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల హెచ్ఓడీలతో ఆయన సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల: వానాకాలం 2026-27 సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు ఆదేశించారు. గురువారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల హెచ్ఓడీలతో ఆయన సమావేశం నిర్వహించారు.
అధికారులకు సూచనలు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన సూచనలను ప్రతి పిపిసి హెచ్ఓడీ అమలు చేయాలన్నారు. పిసిఎస్ఏపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయాలని, నిర్దేశించిన 16 ప్రశ్నలకు సంబంధించిన వివరాల నమోదును త్వరితగతిన ముగించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, డిపిఎం, మెప్మా పిడి, ఇంచార్జి జిల్లా సహకార అధికారి, డిసిఎంఎస్ మేనేజర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






