మందమర్రి, 12 November
మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో మండలంలోని పలు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటిని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మండలంలోని పలు గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అంది దాదాపు రెండు నెలలు కావస్తోంది. నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత మిషన్ భగీరథ లైన్మెన్ ను సంప్రదించగా, పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నాడు.
కేవలం పేపర్ లో కథనం ప్రచురితమైన వెంటనే హడావుడిగా వచ్చి, ఆ వారం రోజులు సంబంధిత గ్రామాలకు నీటిని ఇచ్చి, ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ మిషన్ భగీరథ నీటి గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదని వాపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, మిషన్ భగీరథ నీటిని మా గ్రామాలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని మండల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు..






