Mancherial/Mandamarri (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 19
తెలంగాణలో కొత్తగా ఎంపీ అయిన వారికి పెన్షన్ లబ్ధిదారులకు నిధుల బ్యాంక్ కార్యక్రమం వాయిదా పడింది.
తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ నిధుల జమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం సిద్దిపేటలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది.
అయితే, అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం, దీనిని 26 వ తేదీకి వాయిదా వేస్తూ బుధవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్త లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది.
కాబట్టి నేడు అకౌంట్లలో జమ కావాల్సిన పెన్షన్ నగదు, ఎలాంటి ఆటంకం లేకుండా 26వ తేదీన నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది.







