మంచిర్యాల (మన సమాజం ఎక్ష్ప్రెస్స్) నవంబర్ 13
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే భయపడేది లేదని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘాటుగా హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే భయపడేది లేదని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘాటుగా హెచ్చరించారు. కార్యకర్తల జోలికి వస్తే ముందుగా తనను దాటుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కాకా వెంకటస్వామి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోట్లు, పోరాటాలను ఎదుర్కొందని, లాఠీ దెబ్బలకు, తుపాకీ తూటాలకు సైతం వెనుకాడని చరిత్ర కాంగ్రెస్ కార్యకర్తలదని ఆయన గుర్తుచేశారు. అలాంటి కార్యకర్తలను బెదిరిస్తే భయపడతారని భావించడం పొరపాటన్నారు.
కార్యకర్తలకు ఏ చిన్న అన్యాయం జరిగినా అండగా నిలబడతానని, అక్రమ కేసులు పెట్టినా లేదా బెదిరింపులకు పాల్పడినా ఏ ఒక్క కార్యకర్తను ఒంటరిగా వదిలిపెట్టబోనని ఆయన భరోసా ఇచ్చారు.
ఇటీవల జిల్లా తాళ్లపేటలో జరిగిన సర్పంచ్ దాడిని తీవ్రంగా ఖండించిన ఎంపీ వంశీకృష్ణ, బాధిత మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు తాను, మంత్రి వివేక్ వెంకటస్వామి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఎంపీ వంశీకృష్ణ హెచ్చరించారు.


