మందమర్రి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పరస్పరం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












