కోడూరు
మండలం అనంతరాజుపేటలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆదివారం 1983-84 పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనానికి అప్పటి ఉపాధ్యాయులతో పాటు వివిధ ప్రాంతాలలో ఉన్న పూర్వపు విద్యార్థులందరూ ఒకచోట చేరి తమ విద్యాభ్యాస అనుభవాలు, గురువులు నేర్పిన పాఠాలు, అప్పటి అల్లర్లు, ముచ్చట్లు, ఆత్మీయత, రాగాలు, పూర్వాపరాలను పూర్తిస్థాయిలో తెలియజేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారందరూ ఒకచోట చేరి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులైన నరసింహయ్య, సుబ్బరామమూర్తి, వెంకట్రామిరెడ్డి, ప్రభాకరయ్య, సుబ్రహ్మణ్యం తదితరులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎస్పీ సుబ్రహ్మణ్యం, చార్టెడ్ అకౌంటెంట్ ముధపాల జయరాం, విశ్రాంత ఏజీపీ మేనేజర్ మోహన్ రెడ్డి, మహిళా ప్రతినిధులు విజయలక్ష్మి, కన్నగి పద్మజ, ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ కార్యనిర్వాహకులు మక్కా స్కూల్ అధినేత పన్నీరు రాజశేఖర్, పంజం విజయ రంగారెడ్డి, మనోహర్ రెడ్డి, కల్లా చలపతి నారాయణ, శ్రీనివాసులు, వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోడూరు మండలం అనంతరాజుపేటలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఆదివారం 1983-84 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు ఒకచోట చేరి తమ విద్యాభ్యాస అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు
అనంతరాజుపేట పాఠశాలలో ఏ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది?
అనంతరాజుపేటలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఎవరు పాల్గొన్నారు?
1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు, విశ్రాంత అధికారులు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

